31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు







నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక దశాబ్దం ఇట్టే గడిచిపోయింది.  అందరికీ ఆరోగ్యం అన్న కల కల్లగానే మిగిలిపోయింది. మనం ఆశాజీవులం.  గతం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగిరాదు.  అందుకే  ప్రజలందరి ఆకాంక్షలు  నెరవేరేందుకు మరింతగా ఈ నూతనసంవత్సరం దోహదం చేయాలనీ, ప్రజారోగ్యం కోసం జరిగే అన్నిరకాల  ప్రయత్నాలు, ఉద్యమాలు మరింత వినూత్నంగా, సజీవంగా, ప్రజలకు చేరువగా పుంజుకోవాలనీ, రాబోయేకాలం ప్రజారోగ్యసాధనకు దోహదం చేయాలనీ ఆశిద్దాం. ఆ దిశగా ప్రజారోగ్య పక్షపాతులందరూ నూతన సంవత్సరం -2011 లో మరింత ఉత్సాహంతో , ఆరోగ్యంతో పనిచేయాలని కోరుకుంటూ,


డా.శివబాబు
ప్రగతి నర్సింగ్ హోమ్,
జహీరాబాద్, మెదక్ జిల్లా, అంధ్రప్రదేశ్

30, డిసెంబర్ 2010, గురువారం

ప్రపంచ మధుమేహ దినం - 2010

ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న మధుమేహదినం గా జరుపుకుంటూ, మధుమేహవ్యాధి తీవ్రతగురించీ, నివారణ గురించి ప్రజలలో చైతన్యం పెంచేందుకు కృషి  జరుకుతున్నది. ఈ క్రమంలో భాగంగా 2010నవంబర్ 14న  ప్రపంచమధుమేహదినం క్యాంపెయిన్ ను బెల్జియంలో అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అద్యక్షులు జీన్ క్లాడి మెబెన్యా ప్రారంభించారు.  2010కి గాను " ఈ క్షణమే మనం మధుమేహాన్ని నియంత్రించుకుందాం " అన్న ప్రచారనినాదాన్ని ప్రకటించడం జరిగింది. నేడు మనదేశంలో  5కోట్ల 8లక్షలమంది మధుమేహ రోగులతో ప్రపంచంలోనే అత్యధిక మధుమేహరోగులు కల్గిన పరిస్ధతిలో మధుమేహవ్యాధి గురించి కొన్ని విషయాలు పరిశీలిద్దాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-170367

అవాండియా (రోజిగ్లిటజోన్) వాడకం - ఆరోగ్యంపై ప్రభావం

అవాండియా (రోజిగ్లిటజోన్) అనేమందు టైప్ 2 డయాబెటిస్ లో  ఇన్సులిన్ సెన్సిటైజర్ గా  విస్తృతంగా వాడకంలో ఉంది. ఈ మందు వాడకం వల్ల అనేక వందలమంది గుండెసంబంధిత వ్యాధులతో మరణించారన్న వాస్తవం ప్రపంచవ్యాప్తంగా వెల్లడై యూరోపియన్ దేశాల్లో నిషేధించబడ్డ తర్వాత కూడా మనదేశంలో చాలాకాలం వరకూ చలామణీలో ఉంది. ఇదే తంతు గతంలో ట్రోగ్లిటజోన్ అనే మందు విషయంలో కూడా జరిగింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బహుళజాతిమందులకంపెనీల లాభాపేక్షకు మరో మచ్చుతునక ఈ " అవాండియా " ఉదంతం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-161313

ప్రపంచ రక్తదాన దినోత్సవం -2010

ఆపదలో ఉన్నవారికి  రక్తం దానం చేయడం వల్ల ఇంకో ప్రాణాన్ని నిలబెట్టినవారమవుతాము. ఒక్క ప్రాణమే కాదు, మీరిచ్చే ఒక్క పూర్తియూనిట్  (300-450మి.లీ) రక్తంతో నిజానికి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు మీరిచ్చే రక్తంలోని ఎర్రరక్తకణాలను  రక్తహీనతతో ఉన్న ఒక వ్యక్తికి,  ప్లాస్మా అనే ద్రవాన్ని హీమోఫిలియా వంటి బ్లీడింగ్ డిసార్డర్ ఉన్న మరో వ్యక్తికీ, ప్లేట్ లెట్స్ ను  డెంగ్యూవంటి ప్రాణాంతకజ్వరంతోనున్న మరింకో వ్యక్తికీ ఇవ్వడం ద్వారా ఒక్కసారి ఒక్కరు చేసే రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ సామాన్య ప్రజలలో రక్తందానం పట్ల ఉన్న భయాలు - అపోహలు వల్ల అవసరమైనంత రక్తం లబించక పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్వచ్చంద రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలు తొలగించి  సన్నద్ధుల్ని చేసేందుకు కొన్ని విషయాలు తెలుకుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-117214

పొగాకు వాడకం - ఫలితాలు

" పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ "  అని గురజాడ వారు కన్యాశుల్కం నవలలో గిరీశంతో  పలికించారు.ఇది ఎంతవరకూ నిజమోగానీ,  మనదేశంలో రోజుకు 2200మంది  కేవలం పొగాకు వాడకం పర్యవసానాలతో మరణిస్తున్నారు. సాలీనా 8 నుండి 9 లక్షల మరణాలు భారతదేశంలో పొగాకు వినిమయం కారణంగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా  నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 90శాతం పైగా పొగాకు వాడకం ఫలితంగా సంభవిస్తున్నాయి.  క్షయ, క్యాన్సర్ వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీసే పొగాకు వాడకం పట్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

చిరుధాన్యాలు - పోషకాహారం

ఆహారం అనగానే మనకు వెంటనే వరిఅన్నం లేదా గోధుమ రొట్టె గుర్తుకువస్తాయి. కానీ  నిజానికి పోషకవిలువల రీత్యా,  ప్రత్యేకించి ఐరన్, కాల్షియం, ఫైబర్(పీచుపదార్ధం), యాంటి-ఆక్సిడెంట్స్ లభ్యతరీత్యా వరి, గోధుమల కంటే చాలా రకాల చిరుధాన్యాలు మెరుగైనవి. ఉదాహరణకు రాగులు(తైదలు) వరిబియ్యంకంటే 30రెట్లు అధికంగా కాల్షియం కల్గిఉంటాయన్న విషయం మీకు తెలుసా ?  వాతావరణసమతూకం కాపాడటంలో, పోషకవిలువలరీత్యా, మెట్టభూములలోసైతం, రసాయన ఎరువుల అవసరం లేకుండా మానవారోగ్యానికి అత్యంత సహాయకారిగా ఉండే
 చిరుధాన్యాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

కూల్ డ్రింక్స్ - వాస్తవాలు

కూల్ డ్రింక్స్ అనగానే ఎండాకాలం గుర్తుకొస్తుంది కదూ ! కానీ కొందరు ఎప్పుడూ కూల్ డ్రింక్స్ త్రాగుతూనే ఉంటారు.  అసలు కూల్ డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కలుగచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ? స్ధూలకాయం, మధుమేహం, అసిడిటి,  ఎముకల బలహీనత, కిడ్నీలోరాళ్లు, కేన్సర్ వంటి వ్యాధులకూ , కూల్ డ్రింక్స్ వాడకానికీ దగ్గరి సంబంధం ఉందని మీకు తెలుసా? కూల్ డ్రింక్స్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడండి.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-94679

గ్లైసీమిక్ ఇండెక్స్ - మధుమేహంలో పాత్ర

సాధారణంగా  మనం తినే ఆహారంలో ఎక్కువశాతం కార్బోహైడ్రేట్స్(పిండిపదార్ధాలు) ఉంటాయన్నది మనందరకీ తెలిసిందే. అయితే అన్ని రకాల పిండిపదార్ధాలూ ఒకేలాగ రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను పెంచవు. సరళ పిండిపదార్ధాలకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువుండటం వల్ల త్వరగా రక్తంలో షుగర్ నిల్వలు పెరుగుతాయి. సంక్లిష్ట పిండిపదార్ధాలకు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువుండటం వల్ల నిదానంగా, క్రమంగా రక్తంలో షుగర్ నిల్వలకు  దారితీస్తాయి. కనుక  మధుమేహరోగులు తప్పనిసరిగా  గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి?  ఏ యే   పిండిపదార్ధాల గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత ?  అనే విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-82234

బి.టి.వంగ - భారతదేశ ప్రజలు

ఇటీవల భారతప్రభుత్వ జన్యు సాంకేతిక పరిజ్ఞాన ఆమోద సంఘం జన్యు పరివర్తిత వంగ ను ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది. దీనిపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇటువంటి బి.టి.వంగ వినియోగం వల్ల రైతులకు కలిగేనష్టాలు, ఈ పంటను తిన్నందువల్ల ప్రజలకు కలిగే అనారోగ్య సమస్యలు అనేకం. ఈ నేపధ్యంలో బి.టి.వంగ విశేషాలను తెలుకుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-72649

29, డిసెంబర్ 2010, బుధవారం

కేలరీలు - కమామిషు

కేలరీలు. ఈ పదం వినగానే  మనం తినే రకరకాల చిరుతిళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్ గుర్తుకొస్తున్నాయి కదూ ! మరి అవసరానికి మించిన కేలరీలు తీసుకోవడం వల్లనే స్ధూలకాయం, మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులు కూడా ఎక్కువవుతున్నాయన్నది వాస్తవం.  అందుకే  అసలు కేలరీలంటే ఏమిటి ?  ఆరోగ్యంగా ఉండాలంటే  రోజుకు  ఎన్ని కేలరీలు తీసుకోవాలి? ఏ రకమైన ఆహారపదార్ధాలలో ఎన్నెన్ని కేలరీలుంటాయి ?  అనే విషయాలు తెలుసుకోవాలి.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-67746

స్ధూలకాయం - పరిణామాలు

మనదేశంలో స్ధూలకాయం (ఒబేసిటి) ఎపిడమిక్ స్ధాయిలో విస్తరిస్తోంది. మధుమేహం, గుండెజబ్బు లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీసే ఈ స్ధూలకాయం భారతదేశంలో సగటున 6శాతంకు పైగా ప్రజలను కబళిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అంచనాల ప్రకారం స్ధూలకాయం కల్గివున్న 70మిలియన్ల మంది సంఖ్యలో భారతదేశం రెండో స్ధానంలో నిలుస్తున్నది. ఇంతటి ప్రమాదకరమైన స్ధులకాయానికి కారణాలు ఏమిటి, నివారణ ఎలా? అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సివుంది.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-60547

మధుమేహంలో పాదాల సంరక్షణ

మధుమేహ వ్యాధి ఉన్న ప్రతి నల్గురిలో ఇద్దరు పాదాలకు సంబంధించిన సమస్యలకు గురవుతున్నారు.మధుమేహవ్యాధి కారణంగా వచ్చిన సమస్యలతో   సగటున ప్రతి 30సెకన్లకు ఒక అంగచ్ఛేదనం (ఆంప్యుటేషన్) జరుగుతున్నది. ఇంతటి తీవ్రమైన అంగవైకల్యానికీ, అనారోగ్యానికీ గురిచేస్తున్న మధుమేహవ్యాధిలో పాదాల సంరక్షణ గురించి అవగాహన కల్గివుండటం తప్పనిసరి.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి

సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ (గార్డాసిల్) విశ్వసనీయత ఎంత?

సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరుతో ఇటీవల భారతప్రభుత్వ ఆరోగ్యమంత్రిత్వశాఖ సహకారంతో  " మెర్క్ " అనే  బహుళజాతి మందులకంపెని చేపట్టిన డెమో ప్రాజెక్టు వివాదాస్పదమైంది. ప్రత్యేకించి ఖమ్మంజిల్లా భద్రాచలం తదితర గిరిజన ప్రాంతాల్లో ఈ వాక్సిన్ వేయబడ్డ కౌమరదశలోని ఆడపిల్లలు  కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడంతో ఈ అంశం అందరి దృష్టికీ వచ్చింది. ఈ వ్యాక్సిన్ గురించి పూర్వాపరాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-47983

ప్రపంచ మధుమేహ దినం-2009

మధుమేహం (డయాబెటిస్) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. భారతదేశంలో 3.5కోట్లకు పైగా రోగులతో ప్రపంచమధుమేహరాజధానిగా  పిలువబడుతున్నది.  ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ కలుగచేయగల మధుమేహవ్యాధికి చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు. మధుమేహం గురించి ప్రజలను జాగృతం చేసేందుకు నవంబర్14,2009 నాడు ప్రపంచమధుమేహదినం జరుపుకుంటున్న నేపధ్యంలో మధుమేహవ్యాధి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/todaysessay/article-42500

27, డిసెంబర్ 2010, సోమవారం

మీకు మధుమేహం వచ్చే రిస్క్ ఎంత ఉంది?

1. మీ తల్లిదండ్రులలో ఎవరికైనా మధుమేహవ్యాధి ఉందా?
2. మీరు స్ధూలకాయం లేదా అధికబరువు కల్గివున్నారా?

3. ఎల్.డి.ఎల్.కొలెస్టరాల్ (చెడు కొలెస్టరాల్) ఎక్కువస్ధాయిలో కల్గివున్నారా?
4. అధికరక్తపోటు (హై బి.పి) ఉన్నదా?
5. పొగత్రాగుతారా?
6. శ్రమ అస్సలు లేని జీవనవిధానం ఉందా?
7. మీరు జంక్ ఫుడ్స్ (ఫాస్ట్ ఫుడ్స్) వంటి పదార్ధాలు ఎక్కువగా తింటారా?
8. ఒత్తిడి అధికంగా ఉండే జీవనవిధానం ఉందా?

    పైన తెల్పిన లక్షణాలలో ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మధుమేహవ్యాధి సాధారణ లక్షణాలు ఏమిటి?

అతిమూత్రం, అతిదాహం, అతిగా ఆకలి, బరువు తగ్గిపోవడం, అలసట, గాయాలు త్వరగా మానకపోవడం, చేతులు-కాళ్లలో నొప్పులు లేదా తిమ్మిర్లు, జననాంగాలవద్ద దురద, చూపు మసకగా కనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
టైప్ 2 మధుమేహంలో చాలామందికి వ్యాధినిర్ధారణ సమయానికి పైన చెప్పిన లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. అనుకోకుండా చేయబడ్డ రొటీన్ రక్తపరీక్షలో షుగర్ వ్యాధి ఉన్నట్లలు బయటపడవచ్చు.

మధుమేహం ఎన్ని రకాలు?

మధుమేహం సాధారణంగా రెండు రకాలుగా చెప్పవచ్చు.
టైప్ 1:  ఇది సామాన్యంగా 14సం.ల లోపు వయస్సులోనే బయటపడుతుంది. ఇన్సులిన్ ను ఉత్పత్తిచేసే బీటా కణాలు నశించిపోవడం వల్ల రోగులు చిన్న వయస్సునుండే జీవితాంతం ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సివుంటుంది.
టైప్ 2 : ఇది సామాన్యంగా 30-40సం.ల వయస్సులో బయటపడుతుంది. ఈరకం డయాబెటిస్ లో ఇన్సులిన్ మామూలుగానే ఉత్పత్తి అవుతున్నప్పటికీ, శరీరకణాలు సరిగా ఉపయోగించుకోలేకపోతాయి. తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉన్నట్లయితే, పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం నూరుశాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరిలో ఒక్కరికే ఉన్నట్లయితే, పిల్లలకు వ్యాధివచ్చే అవకాశం నలభై శాతం వరకు ఉంటుంది. వంశపారంపర్యతతోపాటు స్ధూలకాయం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి అంశాలు కూడా టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి కారణనవుతున్నాయి.

మధుమేహం

మధుమేహం అనగానే చాలామంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్ కు గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. అలాంటివారికి మధుమేహం కూడా ఒక సాధారణవ్యాధి లాంటిదేనన్న ధైర్యం కలిగించాలన్న ఉద్దేశ్యంతో ఇది వ్రాస్తున్నాను. చాలామందికి మధుమేహం కాంప్లికేషన్స్ వ్యాధి ప్రారంభం అయినాక 10 నుండి 15 సంవత్సరాల కానీ కానరావు. కనుక వ్యాధిని సరిగా నియంత్రించుకోగల్గితే కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చును. అందుకే మధుమేహం గురించిన ప్రాధమిక అంశాలు కొన్ని తెలుసుకుందాం.
మధుమేహం అంటే ఏమిటి?
మన శరీరంలో జీర్ణవ్యవస్ధకు అనుసంధానంగా ఉండే పాన్ క్రియాస్ (క్లోమగ్రంధి) అనేది వినాళ గ్రంధి. ఈ క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తిచేస్తాయి. మన రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణకై ఈ ఇన్సులిన్ హార్మోన్ అవసరం. ఇన్సులిన్ హార్మోన్ రక్తంలోని గ్లూకోజ్ ను  శరీరకణాలలోకి తీసుకోబడేటట్లు చేస్తుంది. ఇన్సులిన్ పనివిధానంలో లోపాల ఫలితంగా కానీ లేదా ఇన్సులిన్ పరిమాణంలో తక్కువవడం వల్లగానీ  రక్తంలో అత్యధికంగా గ్లూకోజ్(షుగర్) నిల్వలు పెరిగిన స్దితి ఏర్పడుతుంది. దీనినే మధుమేహం అంటాము.
                      (మధుమేహం గురించిన పూర్తి వివరాలు క్రమంగా నా తదుపరి పోస్టుల్లో వ్రాయగలను)
ప్రజారోగ్యాభినందనలతో,

డా.కె.శివబాబు
జనరల్ సర్జన్ మరియు మధుమేహవ్యాధి నిపుణులు
ప్రగతి నర్సింగ్ హోమ్,
జహీరాబాద్ , మెదక్ జిల్లా, ఆంధ్రప్రదేశ్