27, డిసెంబర్ 2010, సోమవారం

మధుమేహం

మధుమేహం అనగానే చాలామంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్ కు గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. అలాంటివారికి మధుమేహం కూడా ఒక సాధారణవ్యాధి లాంటిదేనన్న ధైర్యం కలిగించాలన్న ఉద్దేశ్యంతో ఇది వ్రాస్తున్నాను. చాలామందికి మధుమేహం కాంప్లికేషన్స్ వ్యాధి ప్రారంభం అయినాక 10 నుండి 15 సంవత్సరాల కానీ కానరావు. కనుక వ్యాధిని సరిగా నియంత్రించుకోగల్గితే కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చును. అందుకే మధుమేహం గురించిన ప్రాధమిక అంశాలు కొన్ని తెలుసుకుందాం.
మధుమేహం అంటే ఏమిటి?
మన శరీరంలో జీర్ణవ్యవస్ధకు అనుసంధానంగా ఉండే పాన్ క్రియాస్ (క్లోమగ్రంధి) అనేది వినాళ గ్రంధి. ఈ క్లోమగ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తిచేస్తాయి. మన రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణకై ఈ ఇన్సులిన్ హార్మోన్ అవసరం. ఇన్సులిన్ హార్మోన్ రక్తంలోని గ్లూకోజ్ ను  శరీరకణాలలోకి తీసుకోబడేటట్లు చేస్తుంది. ఇన్సులిన్ పనివిధానంలో లోపాల ఫలితంగా కానీ లేదా ఇన్సులిన్ పరిమాణంలో తక్కువవడం వల్లగానీ  రక్తంలో అత్యధికంగా గ్లూకోజ్(షుగర్) నిల్వలు పెరిగిన స్దితి ఏర్పడుతుంది. దీనినే మధుమేహం అంటాము.
                      (మధుమేహం గురించిన పూర్తి వివరాలు క్రమంగా నా తదుపరి పోస్టుల్లో వ్రాయగలను)
ప్రజారోగ్యాభినందనలతో,

డా.కె.శివబాబు
జనరల్ సర్జన్ మరియు మధుమేహవ్యాధి నిపుణులు
ప్రగతి నర్సింగ్ హోమ్,
జహీరాబాద్ , మెదక్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

                                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి