ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయడం వల్ల ఇంకో ప్రాణాన్ని నిలబెట్టినవారమవుతాము. ఒక్క ప్రాణమే కాదు, మీరిచ్చే ఒక్క పూర్తియూనిట్ (300-450మి.లీ) రక్తంతో నిజానికి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు మీరిచ్చే రక్తంలోని ఎర్రరక్తకణాలను రక్తహీనతతో ఉన్న ఒక వ్యక్తికి, ప్లాస్మా అనే ద్రవాన్ని హీమోఫిలియా వంటి బ్లీడింగ్ డిసార్డర్ ఉన్న మరో వ్యక్తికీ, ప్లేట్ లెట్స్ ను డెంగ్యూవంటి ప్రాణాంతకజ్వరంతోనున్న మరింకో వ్యక్తికీ ఇవ్వడం ద్వారా ఒక్కసారి ఒక్కరు చేసే రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ సామాన్య ప్రజలలో రక్తందానం పట్ల ఉన్న భయాలు - అపోహలు వల్ల అవసరమైనంత రక్తం లబించక పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో స్వచ్చంద రక్తదానం పట్ల ప్రజలలో ఉన్న అపోహలు తొలగించి సన్నద్ధుల్ని చేసేందుకు కొన్ని విషయాలు తెలుకుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-117214
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి